మహనీయులను కేవలం ఒక వర్గ ప్రతినిధులుగా చూడటం తగదని తెలంగాణ బహుజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ బానోతు బద్రు నాయక్ , జిల్లా చైర్మన్ పోత గాని వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల ను గిరిజనుల కమిటీ ఆధ్వర్యంలో, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జయంతులను దళితుల కమిటీ ఆధ్వర్యంలో, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని బీసీల కమిటీ తో కులాల వారిగా, వర్గాల కార్యక్రమాలు నిర్వహించడం వారిని అవమానపరచడమే అన్నారు.కులం ,వర్గం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల వల్ల మహనీయులు కేవలం ఒక కులం, ఒక వర్గం కు చెందిన నాయకులు గానే చిత్రీకరించే ఒక ప్రణాళిక అమలు చేయాలని చూస్తున్నట్లు ఉంది అన్నారు.
వెంటనే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకొని, ఆయా మహనీయుల జయంతి సందర్భంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని కమిటీని నియమించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ఆయా కమిటీలకు చైర్మన్ గా వ్యవహరిస్తుంటారు అని, జిల్లా కలెక్టర్ తో పాటు సి పి సైతం దీనిపై దృష్టి పెట్టి అన్ని వర్గాలను భాగస్వాములు చేస్తూ మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించాలని కోరారు.
ప్రభుత్వమే ఈ విధంగా , అధికారికంగా ఆయా వర్గాల కమిటీలను ఏర్పాటు చేసి, కార్యక్రమం తలపెట్టడం శోచనీయమన్నారు.