ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నివాసం వద్ద హడావుడి నెలకొంది.కాంగ్రెస్ నేతలను కలిసిన తరువాత తుమ్మల మొదటి సారి ఖమ్మంకు వచ్చారు.
తుమ్మల నాగేశ్వర రావు రాక నేపథ్యంలో ఆయన అభిమానులు నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.మరోవైపు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరికాసేపటిలో తుమ్మల నివాసానికి వెళ్లనున్నారని తెలుస్తోంది.
అయితే తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదా అన్న దానిపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.ఈ మేరకు ఆయన అభిమానులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.