'వీరమల్లు' నుండి బర్త్ డే బ్లాస్ట్.. ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈయన బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Hari Hara Veera Mallu Unveils Exciting New Poster On Pawan Kalyan’s Birthday,-TeluguStop.com

ఈ రోజు పవన్ కళ్యాణ్ తన 52వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ట్రీట్ కూడా భారీ లెవల్లో ప్లాన్ చేసారు.మరి ఎటువంటి అప్డేట్ లేకుండా పవన్ ”హరిహర వీరమల్లు’‘( Hari Hara Veera Mallu ) నుండి అప్డేట్ వచ్చింది.

Telugu Harihara, Nidhhi Agerwal, Pawan Kalyan, Pawan Kalyans-Movie

ఈ ఉహించని సర్ప్రైజ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఆలస్యం కారణంగా ఫ్యాన్స్ లో అసంతృప్తి పెరిగింది.దీంతో ఈ సినిమాను పక్కన పెట్టి మిగతా సినిమాలపై ఫ్యాన్స్ ద్రుష్టి పెట్టారు.ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తుంది.

ఇప్పటికే 70 శాతం పూర్తి చేసిన ఈ సినిమా ఆ కొద్దిగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.కానీ పవన్ డేట్స్ లేని కారణంగా ఆగిపోయింది.

ఇదిలా ఉండగా ఈ రోజు మాత్రం ఈ సినిమా నుండి సాలిడ్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.పవన్ గడ్డం పెంచి ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని సీక్వెన్స్ లు చేసిన విషయం తెలిసిందే.

Telugu Harihara, Nidhhi Agerwal, Pawan Kalyan, Pawan Kalyans-Movie

అదే పోస్టర్ ను ఇప్పుడు పవన్ బర్త్ డే( Pawan Kalyan Birthday ) కానుకగా రిలీజ్ చేసారు.పవన్ సీరియస్ లుక్ లో హుందాగా నడిచి వస్తున్నట్టు కనిపించగా బ్యాక్ గ్రౌండ్ లో దెబ్బలతో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు.అంటే పవర్ స్టార్ సీరియస్ ఫైట్ చేసినట్టు అనిపిస్తుంది.మొత్తానికి ఈ ఊహించని పోస్టర్ అయితే అదిరిపోయింది అనే చెప్పాలి.ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal )హీరోయిన్ గా నటిస్తుండగా. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్ లో నటిస్తుంది.చూడాలి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎలాంటి హిట్ అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube