ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల హవా ఎక్కువైంది అన్న విషయం తెలిసిందే.ఎంతో మంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ ఇక్కడ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు అని చెప్పాలి.
ముఖ్యంగా సీనియర్ హీరోలు ఇలాంటి రిమేక్ సినిమాలకే పెద్ద పీట వేస్తున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మలయాళ మూవీ అయిన లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ కి లూసిఫర్ సినిమాకి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
అవి ఏంటో తెలుసుకుందాం.
గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్ లుక్స్ విషయంలో చిత్ర బృందం బాగా జాగ్రత్తలు తీసుకుంది.
అభిమానులు ఎక్కడ నిరాశ పడకుండా జాగ్రత్త పడింది.
మెగాస్టార్ సినిమా అంటే ఎక్కడో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.
అందుకు తగ్గట్లుగానే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు దర్శక నిర్మాతలు.

మెగాస్టార్ సినిమా అంటే పవర్ఫుల్ డైలాగులను ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు.ఈ క్రమంలోనే అభిమానుల అభిరుచికి తగ్గట్లుగానే ఆల్రెడీ ఇప్పటికే రాజకీయాలకు దూరం అయ్యాను అని మెగాస్టార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయ్.
అదే సమయంలో ఇక మంచి కంటెంట్ ఉన్న లూసీఫర్ సినిమాను ఎలా తీస్తారు అని అందరు భయపడినప్పటికీ ప్రేక్షకుల ఊహించిన దాని కంటే ఎంతో బాగా చేశాడు దర్శకుడు మోహన్ రాజా.
ఈ క్రమంలోని అభిమానులందరినీ కూడా సాటిస్ఫై చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.