కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రెండు పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు.
మిగతా హామీలను కూడా వంద రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేమన్న ఆయన గతంలో కొందరు వ్యక్తుల వలన తప్పులు జరిగాయని పేర్కొన్నారు.
అయితే తమ ప్రభుత్వ హయాంలో అటువంటి తప్పిదాలు ఏం జరగవని చెప్పారు.ఇందిరమ్మ రాజ్యంతో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.







