బ్లాక్ హెడ్స్.చాలా మందిలో కామన్‌గా ఈ సమస్య కనపడుతుంటుంది.
ముఖం పై చిన్నగా నల్లటి పొక్కులు ఏర్పడటాన్నే బ్లాక్ హెడ్స్.వీటి వల్ల ఎంత అందంగా ఉన్నా.
అందహీనంగా కనపడుతుంటారు.దీంతో ఈ బ్లాక్ హెడ్స్ పోగొట్టుకునేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు.
అయినప్పటికీ ఫలితం లేకుండా ఎంతగానో బాధ పడతారు.అయితే సహాజంగానే బ్లాక్ హెడ్స్‌ను నివారించుకోవచ్చు.
ముఖ్యంగా సముద్రపు ఉప్పు బ్లాక్ హెడ్స్‌ను తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.మరి సముద్రపు ఉప్పు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా సముద్రపు ఉప్పు మరియు నిమ్మ రసం బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
ఇరవై నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా మూడు రోజులకు ఒకసారి చేస్తుంటే.
బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోయి.ముఖం అందంగా మారుతుంది.

సముద్రపు ఉప్పు బ్లాక్ హెడ్స్‌ను తగ్గించడమే కాదు.మరిన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది.ఒక బౌల్‌లో సముద్రపు ఉప్పు తీసుకుని అందులో కొద్దిగా స్వచ్ఛమైన తేనె వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.
ముఖంపై నల్ల మచ్చలు పోయి కాంతివంతంగా మారుతుంది.
ఇక ముడతలను తగ్గించి.
చర్మాన్ని యవ్వనంగా మార్చడంలోనూ సముద్రపు ఉపయోగపడుతుంది.సముద్రపు ఉప్పులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.
ముఖానికి అప్లై చేయాలి.పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల ముడతలు, సన్నని గీతలు పోయి.చర్మం యవ్వనంగా మారుతుంది.