దంతాల బలహీనత.కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
దంతాల బలహీనతకు ఎన్నో కారణాలు ఉంటాయి.అయితే కారణం ఏదైనా పొరపాటున కూడా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయరాదు.
వీలైనంత వరకు దంతాల బలహీనతను నివారించుకునేందుకు ప్రయత్నించాలి.అలాగే దంతాల బలహీనలతో బాధపడేవారు ఖచ్చితంగా కొన్ని కొన్ని ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
మరి ఆ ఫుడ్స్ ఏంటి.? వాటిని ఎందుకు ఎవైడ్ చేయాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్స్.
ఎవ్వరైనా సరే వీటిని చూశారంటే తినకుండా నోరును కట్టుకోవడం చాలా కష్టం.కానీ దంతాల బలహీనతతో ఇబ్బంది పడుతున్న వారు స్వీట్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
ముఖ్యంగా చక్కెర తో తయారు చేసిన స్వీట్స్ ను తీసుకోవడం వల్ల దంతాలు మరింత బలహీన పడతాయి.అలాగే చిగుళ్ల సమస్యలు సైతం ఏర్పడతాయి.

డ్రై ఫ్రూట్స్.ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.వైద్యులు కూడా రెగ్యులర్ డైట్ లో డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.కానీ దంతాల బలహీనత తో బాధపడే వారు వీటిని చాలా లిమిట్ గా తీసుకోవాలి.
ఎందుకంటే ఎండు ద్రాక్ష, ఆప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ కు దంత సమస్యలను పెంచే గుణం ఉంటుంది.

చాక్లెట్స్ ఎంత ఇష్టం ఉన్నప్పటికీ దంతాల బలహీనత తో సతమతం అవుతున్న వారు వాటిని దూరం పెట్టడమే మంచిది.చాక్లెట్స్ దంతాల బలహీనతను మరింత తీవ్రతరం చేస్తాయి.ఇక దంతాల బలహీనత తో బాధపడుతున్న వారు కూల్ డ్రింక్స్, బ్రెడ్, పొటాటో చిప్స్, ఆల్కహాల్ వంటి వాటిని సైతం ఎంత దూరం పెడితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇవి దంతాలు మరియు చిగుళ్ళకు హానికరం.కాబట్టి ఈ ఫుడ్ తో జర జాగ్రత్త.