టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ స్వయంకృషితో హీరోగా వరుస విజయాలు అందుకున్నారు.
ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే నటుల్లో శ్రీకాంత్ ఒకరు.కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్లు, విలన్ పాత్రల్లో నటించిన శ్రీకాంత్ అవకాశాలు రావడంతో నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు.
నేటికీ ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడేవాళ్లు మహిళలు శ్రీకాంత్ సినిమాలంటే ఆసక్తి చూపుతారు.దాదాపు 20 ఏళ్ల పాటు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న శ్రీకాంత్ కొన్నేళ్ల నుంచి పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేస్తున్నారు.
హీరోగా శ్రీకాంత్ కు తాజ్ మహల్ తొలి సినిమా.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రీకాంత్ కు హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి.
ఆ సినిమాలు కూడా హిట్ కావడంతో శ్రీకాంత్ కు హీరోగా గుర్తింపు వచ్చింది.
నటుడు శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే వీరాభిమానం.
ఆ అభిమానం వల్లే చిరంజీవి సినిమాల్లో శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించాడు.టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాల్లో ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్ నటించారు.
తనతో కలిసి పలు సినిమాల్లో నటించిన ఊహను ఇష్టపడి శ్రీకాంత్ వివాహం చేసుకున్నారు.శ్రీకాంత్, ఊహ జంటకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
శ్రీకాంత్ కుమారులలో ఒకరైన రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.శ్రీకాంత్ మరో కుమారుడి పేరు రోహన్.శ్రీకాంత్ కొడుకుల గురించి ప్రేక్షకులకు తెలిసినా శ్రీకాంత్ కూతురు గురించి మాత్రం తెలియదు. శ్రీకాంత్ కూతురు పేరు మేధ.
మేధ చూడటానికి అచ్చం తల్లిలాగానే ఉంటుంది.భవిష్యత్తులో ఈమె సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి.