ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.అనంతరం ఆయనను నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బండి సంజయ్ పై ప్రధాని మోదీ మాట్లాడాలని ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు.ఈ నేపథ్యంలో బల్మూరి వెంకట్ తో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిని కూడా పోలీసులు గృహా నిర్బంధం చేశారు.







