అమరావతి పై కేంద్రం ఫోకస్ ! భారీగా నిధులు

ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అమరావతి( Amaravati ) వ్యవహారం పై కేంద్రం ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా స్పందిస్తూ వచ్చింది.మొదట్లో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన బిజెపి పెద్దలు.

 Center Focus On Amaravati! Huge Funds, Amaravathi,ap Capital, Central Government-TeluguStop.com

ఆ తరువాత అమరావతికి జై కొట్టారు.మూడు రాజధానులు కాదని,  అమరావతి రాజధానిగా ఉండాలంటూ ఏపీ బీజేపీ కూడా  నినాదాన్ని అందుకుంది.

కానీ వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు .ప్రస్తుతం అమరావతి మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.

Telugu Amaravathi, Ap, Central, Chandrababu-Politics

ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం అమరావతి విషయంలో అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అంచనాల వ్యయాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది .భారీగా నిధులను మంజూరు చేసింది.దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.రాజధానిగా అమరావతి కొనసాగింపు పై వివాదం కొనసాగుతుండగానే , కేంద్రం ఈ విధంగా చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.మూడు రాజధానులలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.అమరావతి రాజధానిగా ఉండాలంటూ స్థానిక రైతులు జేఏసీ నాయకులు( JAC leaders ) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Telugu Amaravathi, Ap, Central, Chandrababu-Politics

ఏపీ హైకోర్టులో అమరావతి కి అనుకూలంగా తీర్పు రావడంతో,  దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.ఇది ఎలా ఉండగానే , అమరావతిలో కేంద్రం కు సంబంధించిన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఆసక్తికరంగా మారింది  ముఖ్యంగా కేంద్రీయ సచివాలయం అంచనా వ్యయాన్ని 1500 కోట్లకు పెంచింది.ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1244.19 కోట్లు గా ఉంది.2023 -24 బడ్జెట్ లో ప్రతిపాదించిన నిధులను ఆయా అవసరాల కోసం కేటాయిస్తూ కేంద్ర పట్నాభివృద్ధి శాఖ సమగ్ర పద్దుల వివరాలను విడుదల చేసింది.దీంతోపాటు విశాఖ కేంద్రంగా సాగుతున్న నిర్మాణాలకు కేంద్రం నిధులను కేటాయించింది.46.76 కోట్ల అంచనా  వ్యయంతో విశాఖ డాబా గార్డెన్స్ లో ఆదాయ పన్ను శాఖ నూతన భవన నిర్మాణానికి రూ.18.17 కోట్ల వ్యయం తో విశాఖలో కేంద్ర జీ ఎస్టీ సిబ్బంది క్వార్టర్ల  నిర్మాణానికి, 18 .17 కోట్ల వ్యయంతో విశాఖలో కేంద్ర జీఎస్టీ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి 50 లక్షలు, దీని కోసం భూమి కొనుగోలు నిమిత్తం 5 కోట్ల తో భూమి కొనుగోలుకు లక్ష రూపాయలను కేటాయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube