మరో మూడు నాలుగు రోజుల్లో భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్...?

నల్లగొండ జిల్లా:అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు.నాసా వెల్లడించిన వివరాల ప్రకారం…భూమి మీదకు ఈ నెల 19,20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది.10 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఉంటున్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.గత కొన్నినెలల క్రితమే 58 ఏళ్ల సునీతా విలియమ్స్,61 ఏళ్ల విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో అంతరిక్షానికి పయనమైయ్యారు.

 Sunita Williams To Return To Earth In The Next Three To Four Days, Sunita Willia-TeluguStop.com

కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు సునీతా, విల్‌మోర్‌ స్పేస్‌కు వెళ్లారు.కానీ, ఊహించని పరిణామాలతో జూన్ 5న ఫ్లోరిడాలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.కానీ, ఫలితం శూన్యం.

చేసేదేమిలేక వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబర్ 7,2024న భూమిపైకి తిరిగి వచ్చింది.ఆ పరిస్థితుల్లో భూమిపైకి ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడం ప్రమాదకరమని నాసా భావించింది.

ఆ తర్వాత విల్‌మోర్‌,సునీత విలియమ్స్ ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ముందుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్‌ ద్వారా వారిద్దరిని భూమిపైకి తీసుకురావాలని భావించారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వీరిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube