గత్యంతరం లేక మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కుతున్న రైతన్నలు...!

నల్లగొండ జిల్లా: నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలోని ఐకెపి కేంద్రంలో అకాల వర్షాలతో తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గురువారం నల్లగొండ-నకిరేకల్ ప్రధాన రహదారిపై రైతులు మొలకెత్తిన ధాన్యంతో బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్పా రైతుల పక్షపాతిగా ఎప్పుడైనా వ్యవహరించారా అని రైతులు ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులపై నిప్పులు చెరిగారు.

 Farmers Protest With Sprouted Grain In Nakirekal Mandal Thatikallu Village, Farm-TeluguStop.com

ధాన్యం కొనేవారే లేరా? రైతుల కష్టం పాలకులకు పట్టదా? అని ప్రశ్నించారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంటాలు సకాలంలో కాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని మ్యాచర్ తో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.రైతులు నిరసన వ్యక్తం చేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని లేనియెడల ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube