ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఎలక్ట్రికల్ డిఈ ఆస్తులు 100 కోట్లపైనే

నల్గొండ జిల్లా:మిర్యాలగూడ ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ శాఖ డీఈ ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ గురయ్యారు.హైదరాబాద్​లలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు కనిపించాయి.

 Electrical De Assets Seized In Acb Raids Are Over Rs 100 Crore-TeluguStop.com

రూ.కోట్ల విలువైన భూముల కాగితాలు,తోటల వివరాలు,ఆస్తుల దస్తావేజులతో పాటుగా బంగారు,వెండి,డైమండ్ ఆభరణాలు ఏసీబీ అధికారులకు కనిపించాయి.వాటన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మురళీధర్ రెడ్డి మిర్యాలగూడలో టెక్నికల్ ఏఈగా పనిచేయడంతో పాటుగా,హాలియాలో ఏఈగా,దేవరకొండ ఏడీఈగా, చౌటుప్పల్ డీఈగా పనిచేశారు.

దేవరకొండకు చెందిన శివకుమార్ పేరిట బినామీ లైసెన్స్ తెరిచి ఆయన పనిచేసిన ప్రతిచోటా రూ.కోట్లతో పనులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఎలా దొరికారు? లీవ్ రెగ్యులరైజ్ చేసేందుకు లైన్మెన్ నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ,యూడీసీ,జేవోలు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు.ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాన్స్కో కార్యాలయంలో మంగళవారం జరిగింది.

మిర్యాలగూడలోని రెడ్డికాలనీ లైన్మెన్ గా గుంటూరు శ్రీనివాస్ పని చేస్తున్నాడు.తన కుమారుడి అనారోగ్యం కారణంగా 2004 నవంబరు 23 నుంచి సెలవుపై వెళ్లాడు.

తిరిగి 2005 నవంబరు 14న పాలకవీడు లైన్​మెన్​గా విధుల్లో చేరాడు.అయితే 350 సెలవు రోజుల లీవ్ రెగ్యులరైజేషన్తోపాటు,ఇంక్రిమెంట్లు,లీవ్ పీరియడ్ కు సంబంధించిన రూ.7 లక్షల ఎరియర్స్ ఇస్తూ పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ డీఈకి దరఖాస్తు చేసుకున్నాడు.ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీఈ మురళీధర్రెడ్డి,యూడీసీ లతీఫ్,జేవో దామోదర్లు రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు.

రెడ్ హ్యాండెడ్​గా దొరికారు ఆ మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లిస్తేనే ఫైల్ కదులుతుందని తెగేసి చెప్పారు అధికారులు.

దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.వారి సూచన మేరకు మొదటి విడతగా రూ.2లక్షల నగదుతో డీఈ చాంబర్ కు వెళ్లాడు.అక్కడ మురళీధర్రెడ్డి,లతీఫ్,దామోదర్లతో కలిసి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

కాగా,ఏసీబీ దాడిలో పట్టుబడ్డ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.నల్లగొండ,మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నల్లగొండలో దాడులు నిర్వహించారు.

హైదరాబాద్లో మురళీధర్రెడ్డికి చెందిన ఇంట్లో,నల్లగొండలోని లతీఫ్,దామోదర్ ఇళ్లలో సోదాలు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube