మూసీ మూడు గేట్లు ఎత్తిన అధికారులు

నల్గొండ జిల్లా:ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్నా భారీ వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్ట్ కి వరదనీరు అధికంగా చెరడంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంది.

 Officers Who Raised The Three Gates Of Musi-TeluguStop.com

ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం పరిధిలో ఉన్న మూసీ ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 648.50 అడుగులకు చేరడం,ఎగువ నుంచి ఇంకా ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో సోమవారం ఉదయం అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లను ఒక ఫీట్ మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.నీటి విడుదల కారణంగా ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే ఆయకట్టు చుట్టుపక్కల ప్రజలు రైతులను అప్రమత్తం చేశారు.

చేపల వేటకు కానీ,ఇతరత్రా పనుల నిమిత్తం వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.అలాగే పశువులను మూసీ పరిసర ప్రాంతాలకు రాకుండా చూసుకోవాలని సూచించారు.మూసీనదికి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది.మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి కారణంగా మూడు గేట్లు(3,7,10 నంబర్లు) అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.ఇన్ ఫ్లో:1247.79 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో:1992.74 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటిమట్టం:645 ఫీట్లు, ప్రస్తుత నీటిమట్టం:644.61ఫీట్లు, పూర్తి స్థాయి సామర్థ్యం:4.46 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం:4.36 టీఎంసీలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube