బూడిద, పొట్టు లారీలతో ఇబ్బందులు పడుతున్నాం

నల్లగొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రం చుట్టూ ఉన్న రైస్ మిల్లుల నుంచి బూడిద, వరిపొట్టు లారీలు నిత్యం ప్రభుత్వ నిబంధనల మీరి సర్వీస్ రోడ్లతో పాటు జాతీయ రహదారిపై అధిక లోడుతో వెళ్తున్నా పట్టించుకునే నాథుడే లేడని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా ఉన్న ఇటుక బట్టిలకు వరిపొట్టు,బూడిదకు డిమాండ్‌ బాగా ఉండడంతో రవాణా అధికమైందని,అధిక లోడుతో వెళ్తున్న లారీలు పైన పట్టాలు లేకుండా వెళ్లడంతో వెనకాల వెళుతున్న ప్రజలకు, వాహనదారులకు కళ్ళల్లో బూడిద,వరిపొట్టు పడి ఇబ్బందులకు గురికావడంతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

 We Are Having Trouble With Ash And Husk Lorries, Ash And Husk Lorries, Trucks,-TeluguStop.com

నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నా ఆర్టీఏ ఆధికారులు కనీసం తనిఖీలు చేయకపోవడంతో లారీ యజమానులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇటుక బట్టిల వ్యాపారులు మిల్లుల్లో బూడిద, వరిపొట్టును కొనుగొలు చేసి,నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి అధికలోడుతో ఈ తతంగం ఎక్కువగా జరగుతుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ విషయమై ఆర్టీఏ కార్యాలయ అధికారిని ఫోన్ లో సంప్రదించగా అతను అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube