నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో పదవ తరగతి పరీక్ష పేపరు లీకేజీ వ్యవహారంపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియాలో కొందరు కోతి రాముళ్ళు ఉన్నారని,ఆ కోతి రాముడు ఎవరో సందర్భం వచ్చినప్పుడు చెప్తానన్నారు.
కోతికి కొబ్బరి చిప్ప దొరికితే గోకా నాకా అన్నట్లుగా ఉందని,అది అసలే కోతి, పైగా కళ్లు తాగింది,ఇష్టా రీతిలో మాట్లాడుతోందన్నట్లు వాళ్ళ వ్యవహారం ఉందన్నారు.దళితులు అంటే వారికి ఈర్ష్య,గతంలో వాళ్లకు లీకుల అలవాటు ఉంది,వాళ్లకు లీకులు అంటే ఇష్టం,పల్లీ బటానీలకు అమ్ముకున్నారన్నారు.
చదువు విలువ మాకు తెలుసు, దమ్ముంటే డైరెక్టర్ గా ఎదుర్కోవాలి,నా పేరు తీస్తే దళిత సమాజం ఏమనుకుంటుందోనన్న భయం వారికి ఉంది,అందుకే ఆకాశా రాముల ఉత్తరాలు రాస్తున్నారని,వాళ్ళు బయటకు వస్తే నేను కూడా బయటకు వస్తానన్నారు.ఎగ్జామ్ నిర్వహణకు ఒక సిస్టం ఉంటుంది,సిస్టంను అడిగితే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
అనవసరంగా నన్ను గెలికి గెలికించుకోవద్దని హితవు పలికారు.