జర్నలిస్టు సీఎం హయాంలో జర్నలిస్టుల కల నెరవేరేనా…?

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఉద్యమంలో అందరికంటే మెరుగైన పాత్ర పోషించిన జర్నలిస్టుల భవిత్యం రాష్ట్రం వచ్చాక బంగారు తెలంగాణలో బతుకు లేకుండా పోయింది.ఇళ్ల స్థలాల కోసం పదేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోయింది.

 Will The Dream Of Journalists Come True During The Tenure Of A Journalist Cm,  J-TeluguStop.com

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన జర్నలిస్టులను గత పాలకులు నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ఓ జర్నలిస్టు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాకనైనా తమ కల నెరవేరుతుందా అని ఆశతో ఉన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన జర్నలిస్టుల బతుకులు స్వరాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని చెప్పాలి.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు అంటే ఒక గౌరవం,ఒక విలువ ఉండేది.జర్నలిస్టుల అభిప్రాయాలను గౌరవిస్తూనే వారు వార్తల రూపంలో వేలెత్తి చూపే అంశాలను పరిగణలోనికి తీసుకునేవారు.

గత పాలకులు జర్నలిస్టులు నోరు తెరిచి ఇది మా సమస్య అని చెప్పుకోవలసిన పరిస్థితి ఉండేది కాదు.

ఒకవేళ నోరు తెరిచి అడిగితే ఆలస్యంగానే సరే వారి సమస్యలను పరిష్కరించే వారు.

గత పాలకులు కానీ, స్వరాష్ట్రంలో జర్నలిస్టుల బతుకులు పూర్తిగా మారిపోయాయి.ఎంతగా మారిపోయాయి అంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఉద్యమానికి ఊపిరి పోసి,తెలంగాణ గల్లీలో మొదలైన ఉద్యమాన్ని ఢిల్లీ దాకా దాటించింది జర్నలిస్టులే.తెలంగాణ ఉద్యమానికి ప్రపంచానికి చాటడంతో పాటు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వప్నాని సాకారం చేసేలా చేశారు.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు.ఉమ్మడి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో సాయం జరగడం లేదు.

కనీసం సొంత రాష్ట్రం ఉంటే మన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని ఆశించారు తెలంగాణ జర్నలిస్టులు.

ఈ కారణంగానే జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు.

ఉద్యమానికి ఊపిరి పోసి ప్రపంచానికి చాటారు.ఫలితంగా 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కోట్లాది మంది తెలంగాణ ప్రజానీకంతో పాటు జర్నలిస్టులు ఎంతో సంబరపడ్డారు.

కానీ, అనుభవం అయితే తప్ప అన్నట్లుగా స్వరాష్ట్రం ఏర్పాటు అయ్యాక జర్నలిస్టులకు తత్వం బోధ పడలేదు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలకులు అవలంభించిన నియంత్రత్వ పోవడలతో జర్నలిస్టుల బతుకులు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది.

తూతూ మంత్రముగా ప్రభుత్వ మంజూరు చేసిన హెల్త్ కార్డులు పనిచేయక.

ఇళ్ల స్థలాల సమస్య నెరవేరక ఆర్థిక సమస్యలతో అర్ధాకలితో తనువు చాలించిన జర్నలిస్టులు కోకొల్లలు.

కరోనా వేల ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించినది జర్నలిస్టులు.ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు.

ఫలితం తెలంగాణలో కరోనా కాటుకు గురై వైద్యం చేయించుకునేందుకు సరైన ఆర్థిక స్థోమత లేక అసువులు బారిన జర్నలిస్టులు ఎందరో ఉన్నారు.కానీ,కరోనా కాటుకు బలైపోయిన ఏ ఒక్క జర్నలిస్టు కుటుంబాలను బంగారు తెలంగాణ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇదిలా ఉండగా ఉమ్మడి రాష్ట్రం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే సంప్రదాయం ఉండేది.

కానీ,స్వరాష్ట్రం ఏర్పాటు అయ్యాక జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లారు పాలకులు.

దీనితో గడిచిన 10 సంవత్సరాలుగా ఇళ్ళ స్థలాలతో పాటు,హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ తరుణంలో మార్పుకు సంకేతంగా తెలంగాణ ప్రజల బంగారు తెలంగాణ పాలకులకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ సర్కార్ పై తెలంగాణ జర్నలిస్టులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తారని అందరూ ఆశాభావంతో ఉన్నారు.

సో…ఇప్పటికైనా తెలంగాణ జర్నలిస్టుల స్వప్నం సాకారం అవుతుందో లేదో వేచి చూడాలి మరి…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube