ఎమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ ముట్టడి ఉద్రిక్తం...!

నల్లగొండ జిల్లా: హాలియాలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంపు ఆఫిస్ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది.ప్రశ్నాపత్రాలు లీకేజీకి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు.

 Youth Congress Leaders Surrounds Mla Nomula Bharath Camp Office, Youth Congress-TeluguStop.com

ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అనంతరం వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలు లీకేజీ కారణంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.కోచింగ్ సెంటర్‌లలో లక్షల రూపాయలు ఖర్చు చేసి పరీక్షలు రాస్తే వారికి ప్రభుత్వ చేతకాని తనం వల్ల పూర్తిగా నష్టపోయారని అవేదన వ్యక్తం చేశారు.

పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని,సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube