ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.అందుకే తేనెను ఆహారంలో చాలా రకాలుగా ఉపయోగిస్తూనే ఉంటాం.

 Drinking Water With Honey In The Morning But These Precautions Are Mandatory ,l-TeluguStop.com

కానీ తేనె విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అతి ముఖ్యంగా ప్రతిరోజు చాలామంది ఉదయాన్నే గోరివెచ్చని నీటిలో తేనెను కలుపుకొని తాగుతూ ఉంటారు.

అయితే దీనివల్ల వ్యాధి నిరోధిక శక్తి పెరగడంతో పాటు అధిక బరువు సమస్య, డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్ లక్షణాల నుండి త్వరగా బయటపడవచ్చు.

అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఈ తేనె పానీయాన్ని నిమ్మరసం తో కలుపుకొని సేవిస్తే ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చు.

దీని ద్వారా శరీర బరువు తగ్గి ఊబకాయ సమస్య కి చెక్ పెట్టవచ్చు.అయితే చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు.తేనెలో నిమ్మరసం వేసి బాగా మరిగించి లెమన్ టీ అని తాగుతూ ఉంటారు.దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభించవు.

ఎందుకంటే తేనెను మరిగిస్తే ఆ తేనెలో ఉండే ఔషధ గుణాలు నశించిపోతాయి.

అందుకే తేనె పానీయాన్ని తాగాలనుకున్నవారు గోరువెచ్చని నీటినీ మాత్రమే ఉపయోగించాలి.అలాగే ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగితే కడుపులో ఉండే చెడు మలినాలు తొలగిపోతాయి.తద్వారా పేగు కదలికలు మెరుగుపడతాయి.

అలాగే తిన్న ఆహారం తొందరగా జీర్ణమై జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి.అతి ముఖ్యంగా వేసవికాలంలో తొందరగా శరీరం డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటుంది.

అందుకే ప్రతి రోజు ఉదయాన్నే తేనె పానీయాన్ని తాగితే రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.అలాగే అలసట, నీరసం లాంటి లక్షణాలను కూడా తొలగిస్తుంది.మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు కూడా తేనె కలుపుకొని తాగితే మెదడుపై ఒత్తిడి తగ్గి మానసిక ఆనందం కలుగుతుంది.అయితే తేనెను మోతాదుకు మించి తీసుకోవడం ద్వారా వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube