ప్రస్తుతం ఓటీటీలకు మంచి ఆదరణ రావడంతో ఎన్నో కార్యక్రమాలు ఓటీటీలలో ప్రసారమౌతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ పేరిట ఒక టాక్ షో ప్రసారం కాగా తాజాగా సోనీ లీవ్ లో సింగర్ స్మిత వ్యాఖ్యాతగా నిజం విత్ స్మిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవి హీరోలు నాని రానా వంటి వారు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్మిత వీరి నుంచి ఎన్నో విషయాలను రాబట్టారు.
ఇకపోతే నాలుగవ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లల గోపీచంద్ టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు హాజరయ్యారు.

గోపీచంద్ సుదీర్ బాబు ఇద్దరు కూడా వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి నిజజీవితంలో ఎవరికి తెలియనటువంటి సంఘటనలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ ఒకప్పుడు గోపీచంద్ కు కనీసం షటిల్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు తనకు షటిల్ కొనివ్వడం కోసం తన తల్లి పని చేయడానికి కొన్ని కిలోమీటర్ల కాలినడకన వెళ్లి ఆ డబ్బును పోగు చేసి తనకు షటిల్ కొనిచ్చిందని తెలిపారు.

ఇక గోపీచంద్ కూడా మాట్లాడుతూ.షటిల్ నేర్చుకొని వరల్డ్ ప్లేయర్స్ తో పోటీ పడాలి అంటే తప్పనిసరిగా అదే స్థాయిలో ఉన్నటువంటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.అయితే నాతో ప్రాక్టీస్ చేయడానికి ఏ దేశ ఆటగాళ్లు కూడా ఒప్పుకునేవారు కాదు.ఈ క్రమంలోనే ప్రాక్టీస్ చేయడానికి తనకు గట్టి పోటీ ఇవ్వడం కోసం తాను సుధీర్ బాబును తనకు తానుగా ట్రైన్ చేసుకున్నానని తెలిపారు.
నన్ను నేను ఒక ఆటగాడిలా మలుచుకునే ప్రయత్నంలో సుధీర్ బాబుది ముఖ్య పాత్ర అంటూ తెలియజేశాడు.ఇలా తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు సుధీర్ బాబు పాత్ర కీలకంగా ఉందని చెప్పాలి.
ఇలా సుధీర్ బాబు గోపీచంద్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







