అందుబాటులో ఉండాలి.. సేవలందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  ఆదేశించారు.ఎల్లారెడ్డిపేట సీహెచ్ సీ, రికార్డ్స్ ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Available To Serve Collector Sandeep Kumar Jha , Collector Sandeep Kumar Jha, Ch-TeluguStop.com

ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షల చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూం ను, ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గదిని పరిశీలించారు.దవాఖాన లో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, జనరల్ వార్డ్ గది కిటికీలకు మస్కిటో నెట్ ఏర్పాటు చేయించాలని జనరేటర్ వినియోగంలోకి తీసుకురావాలని, ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గది పనులను వేగంగా పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని సీహెచ్ సీ ఇంచార్జీ డాక్టర్ బాబుకు  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారుఅనంతరం కలెక్టర్ మాట్లాడారు.

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు.అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఇక్కడ డాక్టర్లు రఘు, ప్రదీప్, సీహెచ్ సీ ఇంఛార్జి డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube