నల్లగొండ జిల్లా:మా ధాన్యం కొనండి సారూ…అంటూ నల్లగొండ జిల్లా( Nalgonda District ) పీఏ పల్లి మండలం చిలకమర్రి ఐకెపి సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించి రైతులు(Farmers ) శనివారం కోదాడ జడ్చర్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు.గంటన్నర పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాల స్తంభించి,రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ సందర్భంగా కష్టించి పండించిన పంట ఐకెపి సెంటర్లలో ఉంచితే మ్యాచర్ వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడంలేదని,కనీసం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు ఈ వంకతొంగి చూసిన పాపాన పోలేదని వాపోయారు.
మిల్లర్లు,అధికారులు కుమ్మకై రైతులు పండించిన పంట ఒక బస్తాకు 4 కేజీల తరుగు తూకం వేస్తున్నారని,లారీ వాళ్ళు ఒక బస్తాకి మూడు రూపాయలు,హమాలీ ముఠా పేరుతో 500 నుండి 3000 రూపాయలు దాకా రైతుల వద్ద నుండి అదనంగా వసూలు చేస్తున్నారన్నారు.
ఇంత జరుగుతున్నా అధికారులపర్యవేక్షణ కరువైందనిఅన్నారు.ఈ సంఘటన వద్దకు పిఎసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి చేరుకుని రైతులతో మాట్లాడి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేస్తామని,సకాలంలో లారీలు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పంది రుద్రమ శీను( Rudrama srinu ),గడ్డం శ్రీరాములు,రైతులు ఎల్లయ్య ,మదర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.