కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వడదెబ్బతో అస్వస్థతకు గురైన భట్టిని పరామర్శించడానికి వచ్చానని చెప్పారు.
మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చలేదని మండిపడ్డారు.తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వందశాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.చేరికల సమయంలో తమ మధ్య సీట్లు ఒప్పందం లేదని చెప్పారు.
కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఐక్యతతో పనిచేస్తామని స్పష్టం చేశారు.