నూతన ఆర్ఓగా మిర్యాలగూడ ఆర్డీవో

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ నూతన అధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో విధులు నిర్వహిస్తున్న జగన్నాథరావుపై ఎన్నికల సంఘం గురువారం వేటు వేసింది.

 Miryalaguda Rdo As New Ro-TeluguStop.com

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల గుర్తులు,స్థానమార్పిడిపై తదితర అంశాలపై బాధిత యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్ రాష్ట్ర,కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు.తనకు రిటర్నింగ్ అధికారి అన్యాయం చేశారని ఐదవ స్థానంలో ఉండాల్సిన తన పేరును 14వ స్థానంలో నెట్టి, తనకొచ్చిన రోడ్డు రోలర్ గుర్తును రద్దు చేసి బేబీ మేకర్ గుర్తు కేటాయించారని ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ స్పదించింది.బ్యాలెట్ పత్రం యధావిధిగా ఉంచాలని ఆదేశిస్తూ,ఎన్నికల కమిషన్ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడిన ఆర్ఓ జగన్నాథరావును విధుల్లోంచి తప్పించింది.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోసం కొత్త పేర్లను సూచించాలని చెప్పడంతో అధికారులు కొత్త ఆర్ఓ కోసం 3 పేర్లను ఈసీకి పంపించారు.అందులో నుండి ఉప ఎన్నిక కొత్త ఆర్ఓగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ను నియమించింది.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రిటర్నింగ్ అధికారి రాజకీయ పార్టీలకు అనుకూలంగా పని చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube