ఉచిత కరెంట్ ఉన్నోళ్లకు-బిల్లులు మోత లేనోళ్ళకా!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ధనికుల మోటర్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం, నిరుపేదలైన దళితుల ఇండ్లకు 200 యుానిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని కెవిపిఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ధనవంతుల మోటార్లకు ఉచితంగా విద్యుత్తు ఇస్తూ దళితుల ఇండ్లకు బలవంతంగా విద్యుత్తు బిల్లులు వసూలు చేస్తున్నారని,బిల్లులు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.342 జీవో ప్రకారం 100 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఎక్కడా నిధులు విడుదల చేయడం లేదని అన్నారు.పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 200 వందల యూనిట్లు ఇస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వం 300 వందల యూనిట్లు ఇస్తున్నారని అన్నారు.

 Free Electricity For Those Who Don't Pay Bills!-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో కూడా 200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మొదటగా జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం,2 వ దఫా మండల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపనున్నట్లు తెలిపారు.మండల స్థాయి ఏఈఈ లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ప్రతి దళితుడు ఆధార్ కార్డు,విద్యుత్ బిల్లు పేపరు మరియు ఎస్సీ కులం సర్టిఫికెట్ జతచేస్తూ దరఖాస్తులు చేయాలని పిలుపునిచ్చారు.బిల్లు కట్టొద్దు స్తంభమెక్క వద్దు నిరంతరాయంగా దళితుల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు.

గ్రామ గ్రామాన దళితులను ఐక్యం చేస్తూ దరఖాస్తులు పెట్టాలని పెట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరుశురాములు, జిల్లా కమిటీ సభ్యులు కోడిరెక్క మల్లన్న,పాపారావు, దేవయ్య,ఏసు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube