నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా ప్రధాన సెంటర్లో 165 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తెల్లవారుజామున నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్ళు, దుకాణాల కూల్చివేత కార్యక్రమం నిర్వహించారు.మిర్యాలగూడ డీఎస్పీ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో పహారాతో రెవిన్యూ అధికారులు విస్తరణ పనులు మొదలు పెట్టారు.
కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత కోసం పోలీస్ బలగాలను మోహరించినట్లు అధికారులు చెబుతున్నారు.