నల్గొండ జనరల్ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా: నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.జీతాలు సరిగా రావడం లేదని, వచ్చినా ఏ మాత్రం సరిపోవడంలేదని,ఆయా సంస్థల అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేయగా స్పందించిన మంత్రి జీవో నెం.60 ప్రకారం వారి జీతాలను వెంటనే పెంచాలని అప్పటి సూపరింటెండెంట్ లచ్చునాయక్‌కు,పలు అవుట సోర్సింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Outsourcing Employees Of Nalgonda General Hospital, Outsourcing Employees ,nalgo-TeluguStop.com

అయితే సాయి ఏజెన్సీ వారు మంత్రి ఆదేశాలను అమలు చేయకపోగా మంత్రికి ఫిర్యాదు చేసిన వారిని విధుల నుంచి తొలగించి,రికార్డుల్లో వారి పేరు లేకుండా చేయడంతో శుక్రవారం బాధిత ఉద్యోగులు హాస్పిటల్ ఎదుట నిరసనకు దిగారు.

అయితే తమను ఉద్యోగం నుంచి తొలగించారనే సమాచారం అందగానే నాగమణి,జానకి,లలిత గుర్తు తెలియని మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.గుర్తించిన తోటి సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

రెండు గంటల పాటు ఆందోళన చేసైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా బాధితులు తెలిపారు.

అనంతరం పేషంట్ కేర్, శానిటేషన్ వర్కర్లు మాట్లాడుతూ…తమకు లీవ్ కావాలనుకుంటే ఎజెన్సీ యజమాని ఇంటికి వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని,ఒకవేళ అనుకోకుండా ఓ రెండు, మూడు రోజులు రాలేని పరిస్థితి ఉంటే జీతాల్లో ఎక్కువ శాతం కట్ చేస్తారని మండిపడ్డారు.

తమకు ఇచ్చే పీఎఫ్‌లలో కూడా తేడా ఉందని,జీవో నెంబర్ 60‌ ను ఏమాత్రం పాటించకుండానే జీతాలు ఇస్తారని ఆరోపించారు.ఇదేంటని సిబ్బంది ప్రశ్నిస్తే యాజమాన్యం బెదిరిస్తూ పని చేయిస్తారని వాపోయారు.

శానిటేషన్ సిబ్బంది అయిన నాగమణి,జానకి,లలిత ముగ్గురికి నాయకత్వ లక్షణాలు ఉండటంతో వారు తమకు జరిగిన అన్యాయంపై ఏజెన్సీకి ఎదురు తిరిగారని,అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారని అన్నారు.వారిపై కక్ష కట్టిన ఏజెన్సీ వారు మంత్రి వర్గానికి చెందినవారని భావించి వారిని విధుల నుంచి తొలగించినట్లుగా తెలుస్తుందన్నారు.

ఈ విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube