నల్లగొండ జిల్లా: మునుగోడు మండల పరిధిలోని గూడపూర్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి నర్సింహ్మ లింగమ్మ దంపతుల కుమారుడు అక్కెనపల్లి స్వామికి ఆంధ్రా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ లభించింది.2019 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఏపి రీసెర్చ్ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా కెమిస్ట్రీ విభాగంలో పిహెచ్ డి ప్రవేశం పొంది కఠోర పరిశోధనల అనంతరం 2023 ఆగష్టు నెలలో థీసిస్ సమర్పించబడింది.
డా.కె.సురేష్ బాబు, ప్రొ.కె.బసవయ్య పర్యవేక్షణలో “మెటల్ ఆర్గానిక్ ఫ్రేంవర్క్స్ బేస్డ్ మెటీరియల్స్ ఫర్ హైడ్రోజన్ జనరేషన్ అండ్ హైడ్రోజినేషన్ రియాక్షన్స్” అనే అంశంపై థీసిస్ సమర్పించారు.ఫలితాల అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొ.
పి.జి.వి.డి.ప్రసాదరెడ్డి చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు.