నల్లగొండ జిల్లా: మునుగోడు గ్రామ పంచాయితీ నుండి విడిపోయి కొత్త గ్రామ పంచాయితీగా ఏర్పడిన గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన 104 ఓట్లు ఇంకా మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 157,159,163,164 బూతులలో ఉన్నాయని,
వాటిని గుండ్లోరిగూడెం గ్రామ 165 బూత్ లోకి మార్చాలని యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ నాయకులు జంగిలి నాగరాజు అన్నారు.ఈ మేరకు శుక్రవారం మునుగోడు మండల తహశీల్దార్ నరేందర్ కి వినతిపత్రం అందజేశారు.