నల్లగొండ జిల్లా:ప్రపంచంలోని ముస్లింలు అతి పవిత్రంగా,అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వచ్చేసింది.నెలవంక దర్శనంతో ఈనెల 02 నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మసీదులు ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి.నెల రోజులపాటు ఈ దీక్షలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.
సమత,మమతల సమ్మిళితాన్ని చాటిచెప్పే పవిత్రమైన పండుగ రంజాన్.ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించడంతో ముస్లింలు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.నెల రోజుల ఉపవాసాల అనంతరం రంజాన్ పండుగను జరుపుకోనున్నారు.నెలవంక దర్శనంతో దీక్షలు చేపట్టి తిరిగి నెలవంక దర్శనంతో దీక్షను విరమిస్తారు.
నెలరోజుల ఉపవాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.