ప్రభుత్వ ఉద్యోగాలొక్కటే లక్ష్యం కాకూడదు.తెలంగాణలో ప్రత్యమ్నాయా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అపర కుబేరులందరూ ప్రత్యమ్నాయా రంగాల నుండి వచ్చిన వారే.జీవితానికి చదువు కొలమానం.
మానసిక ధైర్యం ఉంటే ప్రతిభతో రాణించోచ్చు.-మంత్రి జగదీష్ రెడ్డి.
నల్లగొండ జిల్లా:జిల్లా పోలీస్ శాఖా ఆధ్వర్యంలో 60 రోజులుగా పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.పోలీస్ ఉద్యోగాల కోసం నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం నల్లగొండలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో 60 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి.60 రోజులుగా సాగిన ఈ శిక్షణా తరగతులలో 227 మంది అమ్మాయిలు,137 మంది అబ్బాయిలు శిక్షణ పొందారు.శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యాతిధిగా హాజరయ్యారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని,ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే అన్న నానుడి నుండి యువత బయటకు రావాలని ఆయన సూచించారు.జీవితానికి కొలమానం చదువే అన్నది నిస్సందేహమని చెప్పారు.
ఆచదువుకు పదును పెట్టి ప్రతిభను వెలికి తీస్తే అద్భుతాలు సృష్టించొచ్చు అన్నారు.తెలంగాణా రాష్ట్రంలో ప్రతిభావంతులకు ఉపాధి రంగంలో మెరుగైన అవకాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు.
పరిశ్రమల రంగం నుండి నిర్మాణ రంగం వరకు తెలంగాణా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు.ఇక్కడి వారికి మాత్రమే కాకండా అంతర్ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి సుమారు 20 లక్షలపై చిలుకు ఉపాధి రంగంలో స్థిరపడిపోయారన్నారు.
అపర కుబేరులందరూ ప్రత్యమ్నాయా ఉపాధి తోటే రాణించారన్నారు.చదువుకున్న చదువుకు తగిన రీతిలో ఉద్యోగం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదని,అదే సమయంలో ఉపాధి అంటే సర్కార్ కొలువు అనే లక్షణరేఖను గీసుకోవద్దన్నారు.
ప్రత్యమ్నాయంగా ఉన్న ఉపాధి రంగాలలో స్థిరపడి ప్రతిభను చాటుకున్న రోజునే మీరు కన్న కలలు సాకారం అవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ రెమారాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.