ఈ నెల 14 న నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

నల్లగొండ జిల్లా:సినీ నటుడు,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 న నల్గొండ జిల్లాలో పర్యటించబోతున్నారు.ఈ నెల 14న హుజుర్ నగర్, చౌటుప్పల్ నియోజకవర్గాలలో చనిపోయిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.

 Pawan Kalyan Visits Nalgonda District On The 14th Of This Month-TeluguStop.com

దీనికి సంబదించిన ఏర్పట్లను తెలంగాణ జనసేన నేతలు,కార్యకర్తలు దగ్గర ఉండి చూసుకుంటున్నారు.అయితే పవన్ కళ్యాణ్ పర్యటన లో కేసీఆర్‌ సర్కార్‌ పై విమర్శలు చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఇక ఇదిలా ఉంటే ఏపీలో అసని తూఫాన్ వణికిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కు పలు సూచనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్.అసని తూఫాన్ ఎఫెక్ట్ ఏపీఫై ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద ఈ తూఫాన్ ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

అలాగే ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని కోరారు.17శాతం మించి తేమ ఉండకూడదనే నిబంధన ఈ సమయంలో వర్తింపజేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.తడిచిన,రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని కోరారు.

అలాగే తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని,ఇళ్ళు దెబ్బతిన్నవారిని ఆదుకోవాలని కోరారు.జనసైనికులు,పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube