నల్లగొండ జిల్లా: విద్యుత్ అధికారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్ షాక్ తో ఓ కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహించిన మృతిని బంధువులు శనివారం మిర్యాలగూడ విద్యుత్ డిఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఈ సందర్భంగా మృతిని బంధువులు మాట్లడుతూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో శుక్రవారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు బైరం నరేష్ (30) ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో మరణించాడని,విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపించారు.
విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.