నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం( Nagarjuna Sagar constituency )లో జరిగిన ప్రతి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగినదని,అభివృద్ధి చేసింది కాంగ్రెస్,అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెసేనని నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్( Kunduru Jaiveer ) అన్నారు.పెద్దవూర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) వల్ల నియోజకవర్గంలోని అభివృద్ధి 10 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు.
ఇక్కడ అభివృద్ధి అంతా శిలాఫలకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు పబ్బు యాదగిరి గౌడ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సతీష్,మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.