ఆన్లైన్ బెట్టింగ్ ప్రాణాలు తీస్తుంది..అయినా మత్తులోనే యువత

నల్లగొండ జిల్లా: జూదం ఆట మహాభారత సంగ్రామానికి కారణమైన విషయం తెలిసిందే.ధర్మరాజును వ్యూహాత్మకంగా దెబ్బతీసి అడవులపాలు చేసిన ఉదంతాన్ని మహాభారత గాధలో మనం చదువుకున్నాం.

 Online Betting Takes Lives But The Youth Are Intoxicated, Online Betting , Youth-TeluguStop.com

అయితే ఇప్పుడు మన వాళ్లు ఆడే నయా జూదం ఆటలో ఓడిన వారు అడవులపాలు కాదు, ఏకంగా తమ జీవితాలనే ఛిద్రం చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.ఇది ఎదురుపడి ఆడే ఆట కానేకాదు.

ప్రత్యక్షంగా సొమ్ములు పెట్టే పనీ లేదు.కానీ,బ్యాంకు ఖాతా మాత్రం ఖాళీ అవుతోంది.ఈ ఆట దెబ్బకు సర్వస్వం కోల్పోయిన ధర్మరాజులూ లేకపోలేదు.”కాయ్ రాజా కాయ్” అంటూ ఒకప్పుడు తిరునాళ్లల్లో కనిపించిన పందేలు ఇప్పుడు ఆన్లైన్ వేదికగా జడలు విప్పాయి.మొబైల్ యాప్ లలో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి దివాళా తీస్తున్నారు.

అంతటితో ఆగకుండా ఆటో,నేనో తేల్చుకోవాలని పంతంపడుతున్న కొందరు అప్పులు చేసి మరీ ఆటలో గుమ్మరిస్తున్నారు.

చివరికి మళ్లీ డబ్బులు పోగొట్టుకుని చేసిన అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులు అమ్మేందుకు సైతం తెగిస్తున్నారు.ఆస్తులు లేని వారు మరో మార్గం దొరక్క ఇక చావే శరణ్యమని భావించి బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

ఇంకొందరు మానసిక ఆందోళనలో పడి కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ పలువురు యువత, ఉద్యోగులు ఆన్లైన్ బెట్టింగ్ (గ్యాంబ్లింగ్)లకు అలవాటు పడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.

ఇదే కారణంతో కొద్ది రోజుల కిందట నల్లగొండ నియోజకవర్గంలో ఓ పచ్చని సంసారం ఆగమైంది.ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టి సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న కొందరు యువకులు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో జూదం ఏదైనా ఆ ఊబి లోంచి బయటపడటమే ఉత్తమమని పోలీసులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు.నల్లగొండ చెందిన సాయిరాం అనే యువకుడు కిరాణా వ్యాపారం చేసి బాగా సంపాదించాడు.

కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవనం సాగించాడు.ఈ క్రమంలో సులభమైన పద్ధతిలో మరింత డబ్బు సంపాదించాలనే అత్యాశ అతని మెదడును తొలిచింది.

ఇందుకు ఆన్లైన్ బెట్టింగ్ మాత్రమే సరైన వేదిక అనుకుని బెట్టింగ్ మాయలో పడ్డాడు.దాదాపు రూ.2.50 కోట్లు నష్టపోయాడు.పీకల్లోతు అప్పుల్లోంచి బయటపడటం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు.చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య శరణ్యం అనుకున్నాడు.హాలియా ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశాడు.

బెట్టింగ్ ప్రసుత్తం పట్టణాలు,పల్లెలు అనే తేడా లేకుండా

18 నుంచి 40ఏళ్లలోపు

వారిని విపరీతంగా ఆకర్షిస్తున్న జాడ్యం ఇది.చెమటోడ్చి సంపాదించడానికి మొగ్గు చూపని యువత ఇలాంటి వ్యాపకాలతో కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో స్నేహితుల ద్వారా ఆన్లైన్ ప్రకటనల ప్రలోభాలతో ఈఉచ్చులోకి దిగుతున్నారు.

జూదం నిర్వాహకులు మొన్నటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు, ఐపీఎల్,తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఏపార్టీ అధికారంలోకి వస్తుంది?’ అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు కాసినట్లు సమాచారం.సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారికి ఆన్లైన్ బెట్టింగ్,గ్యాంబ్లింగు సైబర్ నేరగాళ్లు ఎర వేస్తున్నారు.తొలుత కొంత లాభం ఆశ చూపి ఆ తర్వాత కదలకుండా ఉచ్చు బిగించి అందినకాడికి దోచేస్తున్నారు.

ధనిక,పేద, మధ్య తరగతి,చిరు వ్యాపారులు,ఉద్యోగులు, యువత అనే తేడా లేకుండా ఎవరో ఒకరు తరచూ మోసపోతూనే ఉన్నారు.ఆన్లైన్ బెట్టింగ్లే కాకుండా ఆన్లైన్ లోన్ ఆప్స్ లలో లోన్ తీసుకుని నరకయాతన నరకయాతన అనుభవిస్తున్నారు.

లోన్ సరియైన టైంకి కట్టకుంటే లోన్ యాప్ వాళ్ళు వారి మొబైల్లో డాటాను సేకరించి ఫోటోలు మార్ఫింగ్ లు చేసి తమ కుటుంబీకుల నగ్న చిత్రాలను తమ కాంటాక్ట్ నెంబర్లలో ఉన్న వారికి పంపియ్యడంతో ఎటు చెప్పుకోలేకుండా ఆ పరిస్థితుల్లో కూడా ఎంతోమంది యువకులు ఆత్మహత్య పాల్పడి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube