నల్లగొండ జిల్లా:తెలంగాణ ఎన్నికల్లో( Telangana elections ) ఈసీ కీలక మార్పులు చేసింది.ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చేవారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు.
సహాయకుడు అదే బూత్ కు చెందిన ఓటరై ఉండాలి.తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి.
ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు,సహకుడిగా వెళ్ళినప్పుడు కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు పెడతారు.ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు.పోలింగ్ ఏజెంట్లు( Polling agents )గా సర్పంచ్,వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చు.