పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం సి-విజిల్: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పౌరులకు సి-విజిల్ యాప్ బ్రహ్మాస్త్రం లాంటిదని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినచో ప్రజలు సి-విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

 Brahmastram C-whistle In Citizen's Hand District Sp Chandana Deepti , Sp Chandan-TeluguStop.com

బాధ్యతాయుత పౌరుని చేతిలో బ్రహ్మాసం సి-విజిల్ యాప్ అని,ఇందులో ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, నగదు,వస్తువులు,మద్యం ద్రవ్యాలు పంపిణీ చేయడం,ప్రజల ఆస్తులను అనుమతి లేకుండా ప్రచారాలకు వినియోగించడం,కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఓటర్లను రవాణా,అసత్య వార్తల ప్రసారం,చెల్లింపు వార్తలు ప్రచురణ, మారణాయుధాలు కలిగి ఉండడం,ఇతర ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను చేయవచ్చని తెలిపారు.ఫిర్యాదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వెంటనే సి-విజిల్ లో అప్లోడ్ చేయడంతో నిర్ణీత కాల వ్యవధిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube