నల్లగొండ జిల్లా:బీజేపీ నాయకులు గుండాల్లా దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు పున్న కైలాష్ నేత ధ్వజమెత్తారు.మునుగోడు మండల పరిధిలోని పార్టీ ప్రచార రధంపై కొంతమంది బిజెపి నాయకులు అక్కసుతో దాడి చేసి ధ్వంస పరిచారని,ఈ సందర్బంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమనికి దిగారు.
స్టార్ క్యాంపైనార్ పున్న కైలాష్ నేత చెందిన చోల్లేడు ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని బీజేపీ గుండాలు తమ వాహనంతో ఢీ కొట్టడంతో ప్రచార రథం పల్టి కొట్టడం జరిగిందని, బీజేపీ గుండాలు వాహనం దిగి డ్రైవర్ ను కూడా కొట్టారన్నారు.ఈ దాడులకు నిరసనగా మునుగోడు లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ దాడికి పాల్పడిన గుండాలపై కేసును బుక్ చేసి రాజగోపాల్ రెడ్డిని అనర్హుడుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేసారు,కాంగ్రెస్ పార్టీపై కక్షగట్టి పదే పదే బీజేపీ పార్టీ ఇలాంటి దాడులని కావాలనే కుట్రపూరితంగా చేస్తుందన్నారు.మునుగోడు ప్రజానీకమంతా కాంగ్రెస్ పై చేసే దాడులని గమనిస్తున్నారన్నారు.
ఖ చ్చితంగా కాంగ్రెస్ కు ప్రజలలో ఉన్న ఆదరణను జిర్ణించుకోలేక ఇలాంటి ఘటనలకు ఓడిగడుతున్నారని మండిపడ్డారు.ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి చర్యలకు ఓడిగడుతున్నారని వెంటనే ఆ ఘటనకి సంబంధించిన నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు,వెంటనే స్థానిక ఎస్సై అక్కడికి చేరుకొని జరిగిన సంఘటనపై ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి వారికీ నచ్చజెప్పారు.
ఈ కార్యక్రమంలో భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ రమణరావు,గండ్రసుజాత,చెన్నారెడ్డి,కటం వెంకన్న,ఉదయ్, మధు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.