నల్లగొండ జిల్లా:మత్తు నషాలానికి ఎక్కితే మనిషి మృగంగా మారుతాడని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో!సమాజంలో మందుబాబులు వేసే చిత్ర,విచిత్ర విన్యాసాలు చూస్తే మనం అసలు మనుషులమేనా అనే సందేహం కూడా కలుగుతుంది.ఇలాంటి సంఘటనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడులో మంగళవారం రాత్రి నవనీత వైన్స్ దగ్గర మందుబాబులు సృష్టించిన పైచాచిక వీరంగం చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.మద్యం మత్తులో బ్లేడు వంటి కత్తితో దాడికి తెగబడడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు.
ఈ ఘటనను గమనించిన కొందరు స్థానికులు వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడికి గల కారణాలను గాయపడిన వారు సైతం చెప్పలేని పరిస్థితిలో ఉండటం కొసమెరుపు.