నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా పాలన పేరుతో అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకాలను గురువారం అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా 6 గ్యారంటీల పథకాల దరఖాస్తుల కోసం ప్రజలు పలు జిరాక్స్( Xerox centers ) సెంటర్లలో బారులు తీరారు.
దీంతో జిరాక్స్ సెంటర్లు,మరియు పాస్ ఫోటోల కోసం ఫోటో స్టూడియోలు,ఫుల్ బిజీగా మారాయి.ఏ జిరాక్స్ సెంటర్ చూసిన ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు.ఈనెల 28 నుండి వచ్చే నెల 6 వ తారీకు వరకు పథకాల దరఖాస్తు కోసం ప్రభుత్వం గడువు విధించిందని,దీంతో ఆరు గ్యారెంటీల దరఖాస్తు కోసం ప్రజలు వివిధ ధృవీకరణ పత్రాల జీరాక్స్ కోసం ఎగబడుతున్నారు.ఇదే అవకాశంగా జీరాక్స్ సెంటర్ యజమానులు గతంలో ఒక్కో జీరాక్స్ కి రూ.2 ఉంటే,ప్రస్తుతం రూ.4 నుండి రూ.5 వరకు తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే అటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డుల్లోని దరఖాస్తు కేంద్రాల వద్ద కూడా ప్రజలు బారులు తీరడం గమనార్హం.







