దేవరకొండలో బీఎస్పీ నిరహార దీక్ష...!

నల్లగొండ జిల్లా: టిఎస్పిఎస్సి లీకేజీ బాగోతంపై గత కొద్దిరోజులుగా తెలంగాణ మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పేపర్ లీకేజీ సర్వసాధారణమని 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను చులకన చేసి మాట్లాడడం సిగ్గుచేటని,ఇలాంటి మంత్రుల మంత్రి పదవులను వెంటనే తొలగించి,గతంలో జరిగిన టిఎస్పిఎస్సి పరీక్షల్లో వీళ్లకు సంబంధించిన వారికి ఎంత మందికి ప్రశ్నా పత్రాలను లీక్ చేశారో విచారణ చేపట్టి,వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి ఎర్ర కృష్ణ,దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులురామావత్ రమేష్ నాయక్ అన్నారు.

టిఎస్పిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ చేపట్టాలని,చైర్మన్ ని భర్తరఫ్ చేసి,బోర్డుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ కార్యక్రమానికి వారు ముఖ్యాతిథులుగా హాజరై మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులు కొట్లాడి ప్రాణాలర్పించి సాధించిన తెలంగాణ ఇయ్యాల కుటుంబ పాలనగా మారిందని ధ్వజమెత్తారు.కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత 100 కోట్ల లిక్కర్స్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులందరూ ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ఏసుకొని ఢిల్లీకి పోయే తీరిక ఉంటుంది గానీ,ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితుల మీద మాట్లాడే తీరిక మంత్రులకు గానీ, ముఖ్యమంత్రి గానీ లేదని,ప్రజలను పట్టించుకునే సోయి ఈ ముఖ్యమంత్రి లేదన్నారు.

అందుకోసమే ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన,ప్రజల పక్షాన కొట్లాడుతున్నారని ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ వెంట నడిచి,ఏనుగు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్లు సహాని,కొండ లలిత,నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్,పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్,కొండమల్లేపల్లి మండల కన్వీనర్ కూర శ్రీకాంత్,పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్,కోశాధికారి మాతంగి జాన్, బాలునాయాక్,దత్తు నాయక్,కళ్యాణ్,తరుణ్ చారి,శ్రీకాంత్,కృష్ణ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

Latest Nalgonda News