నల్లగొండ జిల్లా:12 మందితో కూడిన నల్గొండ జిల్లా కబడ్డీ జట్టుకు 4గురు చత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ క్రీడాకారులు ఎంపికైనట్లు చత్రపతి శివాజీ కబడ్డీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి, బొమ్మపాల గిరిబాబు ప్రకటించారు.ఆదివారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్ 20 బాలుర కబడ్డీ విభాగంలో నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన కుంటిగొర్ల కోటేష్,దుగ్యాల శ్రీకాంత్,చింత రవితేజ,దుగ్యాల సందీప్ లు ఎంపికైనారని తెలిపారు.
గత నెలలో దేవరకొండలో జరిగిన సెలెక్షన్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడం ద్వారా జిల్లా జట్టుకు ఎంపికైనారని తెలియజేశారు.ఎంతో పారదర్శకంగా సెలక్షన్ ప్రక్రియను నిర్వహించిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మరియు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయిన గొట్టిపాటి కర్తయ్య, అధ్యక్షులు ఆర్.భూలోక రావు,కోశాధికారి జె.చంద్రయ్యలకు మరియు సెలక్షన్ కమిటీకి క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఎంపికైన నలుగురు క్రీడాకారులు గతంలో జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనడమే కాకుండా,ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ అకాడమీలో శిక్షణ పొందుచున్నారని అన్నారు.