నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి

నల్లగొండ జిల్లా:మూడున్నర ఏండ్లుగా జరగని పనులు నేడు యుద్ద ప్రాతిపాదికన పూర్తి.నా రాజీనామాతోనే మునుగోడుకి కేసీఆర్.

దేశం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది.ఇది పార్టీల మధ్య పోరాటం కాదు, మునుగోడు ప్రజలకు ప్రభుత్వానికి యుద్ధం.నాడు అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రస్థావించినా చేయని పనులకు నేడు నిధులు.21 న జరిగే అమిత్ షా మీటింగ్ ని విజయవంతం చేయాలని పిలుపు.దేశ వ్యాప్తంగా మోడీ అమిత్ షా నాయకత్వం బలంగా పనిచేస్తుంది.

మునుగోడు ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు.మునుగోడు మండల కేంద్రంలో నూతన ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాడు అసెంబ్లీలో ఎన్నిసార్లు గొంతు చించుకొని మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకొని కేసీఆర్ ప్రభుత్వం నేడు నేను రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చినందున మూడున్నరెండ్లుగా చేయని పనులు నేడు పూర్తి చేస్తున్నారని అన్నారు.

అంతేకాకుండా నేను అమిత్ షాని కలవగానే మూడేండ్లుగా ఇవ్వని ఘట్టుప్పల్ మండలం వెంటనే ఏర్పాటుకి ఆదేశించారని,అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పింఛన్లను ప్రకటించారని,నాడు నేను అసెంబ్లీలో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేవనేత్తిన అంశాన్ని కూడా నా రాజీనామాతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు.రోడ్ల గురించి అనేక మార్లు ప్రస్థావించినా పెడచెవినపెట్టిన ప్రభుత్వం,నేడు మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ - నారాయణపురం రోడ్డు,మర్రిగూడెం - మాల్ దారి,మునుగోడు - నల్గొండ వెళ్లే రోడ్డు నేడు హుటాహుటిన పనులు కంప్లీట్ చేస్తున్నారని అన్నారు.

Advertisement

ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్తేనే తప్ప అభివృద్ధి కానరావటం లేదని, అంతేకాకుండా నేడు ఇక్కడ ఉన్న శివన్నగూడెం ప్రాజెక్ట్,ఉదయ సముద్రం ప్రాజెక్ట్ లకి కూడా ఈ ఉప ఎన్నిక ద్వారా పూర్తి చేయాలన్నారు.ఈ రోజు పద్మశాలిలకు భీమాని కూడా ప్రకటించడం జరిగిందని,ఇంకా ప్రభుత్వ దవఖానాలు,ప్రభుత్వ స్కూల్స్ సమస్యలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

మునుగోడు గురించి ప్రస్తావనే వినని ముఖ్యమంత్రి నేడు నియోజకవర్గానికి నా రాజీనామా వల్ల వస్తున్నాడన్నారు.టీఆర్ఎస్ 20 న ఏర్పాటు చేసే మీటింగ్ లో కూడా అనేక హామీలను ఇక్కడ ఇస్తాడని అవేవి నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని కోరారు.

దేశ వ్యాప్తంగా మోడీ అమిత్ షా ల నాయకత్వంలో బీజేపీ చాలా బలంగా ఉందని, తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో నా ఉప ఎన్నికల ఫలితంతో పెనుమార్పులు రానున్నాయని,ఈ రోజు యువత మొత్తం భారతీయ జనతా పార్టీ వెంటే ఉన్నారని అన్నారు.ఈ నెల 21 న మునుగోడులో ఏర్పాటు చేసే బీజేపీ భారీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరుతున్నానని,ఈ సభకి నియోజకవర్గ ప్రజలతో పాటు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు,యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!
Advertisement

Latest Nalgonda News