ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావుకు ప్రేక్షకులలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా కోట శ్రీనివాసరావుకు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
అయితే తాజాగా కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.ప్రతిఘటన సినిమాతో నాకు బ్రేక్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ మాండలీకం అంటే నాకు ప్రేమ అని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.సినిమాలకు ట్రైల్ అనేది నేను ఎప్పుడూ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.అప్పట్లో మరీ నల్లగా ఉండేవాడినని ఆయన తెలిపారు.ఆరోజుల్లో సినిమాలో ఛాన్స్ రాదని నేను అనుకునేవాడినని ప్రతిఘటన సినిమాకు ముందు జంధ్యాల గారికి నేను బాగా పరిచయమని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
ఐదు భాషల సినిమాలలో తాను నటించానని ఆయన తెలిపారు.

తెలుగులో ఇచ్చిన గౌరవం ఇంకెక్కడా దక్కదని ఆయన చెప్పుకొచ్చారు.1994లో నాలుగు రోజులు హంగర్ స్ట్రైక్ చేశానని ఆయన తెలిపారు.ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు రావడానికి నేనే కారణమయ్యానని అయితే ఆ విషయాలను ఎవరూ చెప్పరని ఆయన వెల్లడించారు.
సాధన తక్కువ వాదన ఎక్కువ కావడం వల్లే ఈతరం పాడైపోతోందని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

ప్రస్తుతం వితండ వాదన ఎక్కువైపోయిందని కోట శ్రీనివాసరావు అన్నారు.కుర్రాళ్లు ఒక సినిమా హిట్ అయితే గర్వం ప్రదర్శిస్తున్నారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.మనిషికి విజ్ఞానం పెరగాలని మనవాళ్లు విజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పోగొట్టుకుంటున్నారని వెల్లడించారు.
భోజనం కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చని అదే సమయంలో మాతృభాషను విస్మరించవద్దని కోట శ్రీనివాసరావు సూచనలు చేశారు.ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.