నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క( Sammakka Sarakka ) వద్ద అర్బన్ పార్క్ పేరుతో కోట్ల రూపాయల వ్యయంతో సుందరంగా నిర్మించిన ఈకో ఫారెస్ట్ లో అధికారులు నాలుగు రోజుల క్రితమే జింకలను వదిలారు.వాటిని రక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో గురువారం తెల్లవారు జామున ఓ జింక తిరుమలయ గట్టు సమీపంలో రహదారి మీదికి రాగా విధి కుక్కలు( Street Dogs ) వెంటపడి హతమార్చినట్లు చెబుతున్నారు.
స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన జింక( Deer )ను పంచనామా నిర్వహించి,ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఆ జింకను పూడ్చివేసినట్లు డివిజనల్ ఫారెస్ట్ అధికారి సర్వేశ్వరరావు తెలిపారు.