పంటల సాగును ముందుకు తీసుకురావాలి:మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా:పంటల సాగును ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని,ప్రకృతి వైపరీత్యాల నుండి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ఈ సంచలాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy ) అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యాతిథిగా హాజరై మంత్రి మాట్లడుతూ మే మాసాంతానికి మొదటి పంట,నవంబర్ చివరికి రెండో పంట నాట్లు పూర్తికి ప్రభుత్వం సంకల్పించిదని, మార్చి చివరి నాటికి ధాన్యం కొనుగోలు పూర్తీ అవుతుందని తెలిపారు.

 Cultivation Of Crops Should Be Brought Forward: Minister Jagadish Reddy ,cultiva-TeluguStop.com

అందుకు అనుగుణంగా జెడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి( Banda Narender Reddy ) తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రవంగా తీర్మానించింది.అనంతరం సభలో పలువురు ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు విషయలో మాట్లాడగా అందుకు స్పందించిన మంత్రి తుఫాన్ కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణా అని స్పష్టం చేశారు.

ఈ తరహాలో భారతదేశంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన మరో రాష్ట్రం ఎక్కడా లేదన్నారు.నిజం చెప్పాకంటే ధాన్యం కొనుగోలులో అధికారులు అభినందనీయులని ప్రశంసించారు.విధానాలను తయారు చేసే బాధ్యత వరకు శాసనకర్తలకు పరిమితమని,అమలు పరిచే బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంటుందన్నారు.అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు చెయ్యాలని,రాద్దాంతం చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనం ఉండదన్నారు.

పైగా యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అని కొనియాడారు.మొత్తంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతు పక్షపాతిగా పేరొందిన నేత అని కితాబిచ్చారు.

రైతాంగం గురించి ఆలోచించే మొట్టమొదటి ప్రభుత్వం మనదన్నారు.

ప్రతీ మీడియా హౌస్ కు ఓ ఎజెండా ఉందని, జరుగుతున్న దానిని జరగ లేదని చెప్పేందుకు ఆ మీడియా హౌస్ లు పోటీ పడుతున్నాయన్నారు.

అభివృద్ధి యిష్టం లేని పత్రికలు ఈ తరహ ప్రచారానికి పూనుకున్నరాని మండిపడ్డారు.ఇన్నేళ్ల నుండి రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.ఎవరీ ఎజెండాలను ఉటంకించాల్సిన అవసరం లేదని,అటువంటి ట్రాప్ లో ఏ ఒక్కరూ పడొద్దని ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించారు.ఈ తరహ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రజా ప్రతినిధిగా అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు.

స్ధానిక శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి తోడ్పాటు అందించాలని కోరారు.మీడియా హౌస్ ల ప్రచారానికి స్పందించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ప్రజా ప్రతినిధులకు తేల్చి చెప్పారు.

ఈ సమావేశంలోరాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube