నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై నెలకొన్న సస్పెన్షన్ కి నేడు స్పష్టత రానున్నట్లు సమాచారం.నల్గొండ ఎంపీ ఉత్తమ్,మాజీ మంత్రులు జానారెడ్డి,దామోదర్ రెడ్డి, నల్గొండ డీసీసీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్,పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాకూర్ తో ఇవాళ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోందని పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.