నల్లగొండ జిల్లా:అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట( Ibrahimpeta ) గ్రామంలో ఆక్రమణకు గురైన 15,16, 17,68,72 సర్వే నెంబర్లు గల చెరువు భూమిని ఆక్రమించిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి కీసరి యుగంధర్ రెడ్డి,హాలియా మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్యకి నోటీసులు ఇచ్చి,కబ్జాకు గురైన చెరువు భూమిని తక్షణమే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని స్థానికులు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్( Additional Collector Srinivas ) కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అదనపు కలెక్టర్ సమస్యను పరిశీలించి అనుముల మండల తహసిల్దార్ కి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
గతంలో చెరువు భూమికి హద్దులు ఏర్పాటు చేయడానికి మూడు దఫాలు వచ్చి సర్వే చేయకుండా హద్దులు ఏర్పాటు చేయకుండా వెనుతిరిగారని,ఈసారి తప్పకుండా హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ని కోరామని,అదనపు కలెక్టర్ తప్పకుండా హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు
.