రాజన్న సిరిసిల్ల జిల్లా: చొప్పదండి నియోజకవర్గ పరిధిలో బోయినిపల్లి మండల స్తంభంపల్లి గ్రామంలో ప్రజల చిరకాల కోరిక నెరవేరిందనీ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజి వాగు వద్ద కోటి 80 లక్షలతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రజాప్రతినిధుల తో కలిసి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ భూమి పూజ చేశారు.
స్తంభంపల్లి గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గంజివాగు వంతెనకు మోక్షం లభించిందనీ ఇన్నాళ్లకు వాళ్ల బాధలు తీరనున్నాయనీ అన్నారు.
బోయినిపల్లి మండలం స్థంభంపల్లి గ్రామం మీదుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినా వేములవాడ రాజన్న దేవాలయం ఉంది.
అలాగే జిల్లా కేంద్రం రాజన్న సిరిసిల్ల వెళ్లే రోడ్డు మార్గంలో ఊరికి దగ్గరలో ఒక పెద్ద బ్రిడ్జి ఉంది.దీనిని చాలా సంవత్సరాల క్రితం నిర్మించారు.లారీలు, టిప్పర్లు నిత్యం, భక్తులు బ్రిడ్జి పైన రాకపోకలు సాగిస్తుంటాయి, దీంతోబ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది.అధిక వర్షాలు కురిసినప్పుడల్లా వాహనదారులకు, ప్రజలకు, రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది.
ఈ సమస్యను స్థానిక సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ లు ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి బ్రిడ్జికి కోటి ఎనభై లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జికి భూమి పూజ చేసారు.అలాగే నాలుగు లక్షల 60 వేల రూపాయల నిధులతో నిర్మించబోయే మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణకు,నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు టీఆర్ఎస్ పాలనలో విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయలు మంజూరవుతున్నాయని ఆయన అన్నారు.అన్ని రకాల పథకాలు కలుపుకుంటే, ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయలు వస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు.
ఇంత అభివృద్ధి గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.రైతాంగం కోసం సీఎం కెసిఆర్ ప్రాజెక్టులు కట్టి, సాగు, మంచినీరు ఇచ్చి, 24 గంటల కోతలు లేని కరెంటు ఇచ్చి, పంటల పెట్టుబడులు ఇచ్చి, రైతులకు బీమా చేసి, రుణాలు మాఫీ చేసింది అని ఆయన గుర్తు చేశారు.
ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.గంజివాగు బ్రిర్జ్ తొందర గానే పూర్తి చేయాలని,ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు.
తమ చిరకాల వాంఛ అయినా బ్రిర్జ్ (గంజివాగు) వంతెనకు మోక్షం కలగడంపై స్తంభంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ కోసం వచ్చిన ఎమ్మెల్యేకు స్తంభంపల్లిలో సర్పంచ్ అక్కన పల్లి జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతులతో స్వగతం పలుకగా సర్పంచ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గజవాగు వద్దకు బైక్ ర్యాలీ, డీజే తో వెళ్లి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జూ, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి డైరెక్టర్, కొట్టేపల్లి సుధాకర్, స్థానిక సర్పంచ్ అక్కన పల్లి జ్యోతి ,ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ ,వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.