సాగర్ కాంగ్రెస్ నుండి తండ్రా...తనయుడా...?

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ హస్తం పార్టీ అభ్యర్ధి ఎవరూ? తండ్రా…తనయుడా? అనే చర్చ జోరుగా సాగుతోంది.సాగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం జానా తనయుడు కుందూరు జైవీర్ రెడ్డి( Kundur Jayveer Reddy ) ఒక్కరే గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

 Sagar Is Father From Congress Son , Congress, Sagar , Kundur Jayveer Reddy-TeluguStop.com

కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తండ్రి జానారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉందని టాక్.ఇటీవల జానారెడ్డి సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే స్థాయి నాది కాదని,చేయాలనుకుంటే చేస్తానని వ్యాఖ్యానించడం ఇందుకు బలం చేకూరుతుంది.

నియోజకవర్గం వ్యాప్తంగా సీనియర్ నాయకులు అందరూ జానారెడ్డినే బరిలో ఉండాలని కోరుకుంటుంటే,యువత మాత్రం యువనాయకుడు జైవీర్ రెడ్డి పోటీలో ఉండాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వినికిడి.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో చివరిసారిగా జానారెడ్డి పోటీచేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీలో ఉండాలని సీనియర్లు ఆశ పడుతున్నట్లు సమాచారం.

ఆయన కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనితో సాగర కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.

అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే తప్పా ఈ సందిగ్దానికి తెరపడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే సాగర్ బరిలో తండ్రి,తనయుడు ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా ఈ సారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ సాగర్ లో నిలిచేది గెలిచేది తండ్రా…తనయుడా…? చూడాలి మరి…!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube